Sunday, May 20, 2012

నా కవిత ...


చాన్నళ్ళుగా నడుపుతున్న కారే
ఎన్నేళ్ళుగా ఎదురుచూస్తున్న 'షి'కారే
ఈ రోజు  నా కూడ నువ్వొస్తుంటె 
ఉరకలేస్తుందే నా కారు, నిండు గోదావరి వలె ...

కొన్నేళ్ళుగా నడుస్తున్న దారే
ఏనాడు నా వంక చూడని జెనాలే
ఈనాడు నీ హంస నడకతొ కలిసి నేనడుగులేస్తుంటె
గుచ్చి గుచ్చీ చూస్తున్నారే, గుడ్ల గూబల వలె ...

వందల్లొ మురిపించె గాయిని గాయకులున్నా 
వేలల్లొ మైమరిపించె మెలోడి గీతాలు ఉన్నా 
సంధ్యా సమయాన సన్నని నీ కూని రాగాలు వింటుంటె
అలసటంతా ఆవిరై ఉత్సాహము ఉదయించే నాలో, తూరుపు సిందూరం వలె ...

అంతు పట్టని అలజడి ఆలోచనలున్నా 
అస్త వ్యస్తంగా అర్తం కాని అంతరంగమున్నా 
ఈ క్షణం నీ ముసి ముసి నవ్వును చూస్తుంటె  
మురిసిపోతుందే నా మనసు, ముద్ద మందారం వలె ...

ఎన్నో భావాలున్నా చెప్పలేని మౌన జీవతంలొ
మరెన్నో ఊహల ఊసులున్నా పంచుకోలేని ఒంటరి ప్రయాణంలొ
తారసపడ్డ నీ ముద్దు ముద్దు పలుకులతో  జత కలుపుతుంటె
మనసులోని మాటలు పాటలై ఉప్పోంగుతున్నాయే, ఈ నా కవిత వలె ...
                                                                              

 L Ragas

మున్న... (నా బంగారు కొండ)


Happiest day of my life:          వాడు పుట్టిన రోజు
Desperate period of my life:   (45 days of waiting) వాడిని first time చూడటానికి
Best part of my life:                (my present time)వాన్ని చూసుకుంటూ నన్ను నేను మరిచిపోవటము

  
Friendship Quote I like most:  నాన్న నీకోవిషయము చెప్పనా ... మున్నా నాన్న గుడ్ ఫ్రెండ్స్
Song I laugh most: చిట్టి చేతులను లడ్డు ఆకారంలో తిప్పుతూ వాడు పాడే రోబో సినిమా పాట "చిట్టి చిట్టి రోబో నా  లడ్డు లాంటి రోబో ....."
Ringtone I love most: నాన్న నువ్వు busy నా.... అంత scene లేదు నీకు ... lift చెయ్యి.... phone lift చెయ్యి నాన్న....


Moment my anger converted to great pain:  వాడు చూసిన first violent situation, నేను నా శ్రీమతి గొడవపడి high toneలోవాదించు కుంటున్నాము ... వాడు బెదురుతున్న కళ్ళతోఒణుకుతున్న స్వరంతో "నాన్న సారీఅమ్మ సారీఅక్క సారీఅంటూ నా దగ్గరికిఎదురుగా ఉన్న అమ్మ దగ్గరికి పక్కనే ఉన్న అక్క దగ్గరికి పరిగేట్టటం చూసినక్షణాన ...
Moment I could not stop tears in public:  school కెళ్ళిన first రోజుఅన్నీ ముచ్చట్లు చెప్పి లోపలికి పంపిస్తుంటే వెనిక్కి తిరిగి "నాన్ననువ్వు మళ్లీ వచ్చి నన్ను తీసుకెళ్తావు కదూ..." అని జాలిగా నావైపు చూస్తూ అడుగులేస్తున్నక్షణాన ....

Moment I felt like "this is life":  school కెళ్ళిన first రోజేలాంగ్బెల్  కొట్టెవరకుఆ school చుట్టూ తిరుగుతూ గేటు దగ్గరే wait చేస్తున్ననన్ను చూసి పరిగెడుతూ గెంతులేస్తూ నామీదకు దూకి "నాన్న నేనొచ్చేసా..." అన్న క్షణాన ....

L Ragas ..

మా ఊరు ...


రాయులు పరిపాలించిన రాయలసీమ ప్రాంతాన
తిరుమలేశుని తొలి గడప కడప జిల్లాలో
ఆది కవి అన్నమాచార్య స్వగ్రామము తాళ్ళపాకకు
ఏక శిలాపర్వతము ఒంటిమిట్టకు నడుమ ఒక మొస్తరు ఊరు మా ఊరు
 
ఆరు శతబ్దాల క్రితం తెలుగు ఛోళరాజుల మునుపు
నందుల పాలనలొ వెలిసిన మా ఊరు నామదేయం నందలూరు
పలనాటి పౌరుశాలు కాని, సీమ ఫాక్షనిజం కాని లేని ఈ ఊరులొ
ఛోళరాజుల కళావైభవానికి సాక్షిగా నిలిచిన శ్రీ సౌమ్యనాద ఆలయము ఎకైక ఆకర్షణ


ఒక వైపు భాహుద నది మరొ వైపు కన్యకా చెరువు తొ
జల కళ నిండుగా ఉండాల్సిన ఈ ఊరిలొ
వరున దేవుడి శాపానికి, బడా బాబుల పాపానికి
ప్రస్తుతానికి పాతాల గంగయే పొలాలకు పన్నీరు, జెనాలకు తాగు నీరు

శ్రీ కృష్నుడి కుల వ్యవస్తతొ విరాజిల్లిన హిందు సాంప్రదాయం గల ఈ ఊరిలొ
అలనాడు సిద్దవటం నవాబుల బలత్కారాలు, బ్రిటిష్ ఎర్ర కొతుల సైన్యం ఆగడాలతొ
మొదలైన మత మార్పుడులను ఈ నాడు చాపకింద నీరులా మిషనిరీలు
ప్యార్,ఇష్క్ మొహబ్బత్ ముసుకేసుకున్న లవ్ జిహాదీలు ఇంకా కొనసాగిస్తునే ఉన్నాయి


ఎడాదిలొ అయిదారు మాసాలు మాత్రమే పఛ్హగా కనిపించే పొలాలు
భానుడి ప్రతాపానికి ఎర్రగామండె ఎత్తుపల్లాలు
ఎన్నికల సమయంలొ మాత్రమే తిరిగె బావి బొరు మొటార్లు
సన్న కారు రైతన్నను కూలివాన్ని చేసాయి, కూటి కోసం కువైట్ దరికి నెట్టాయి


గర్వించె గతము లేదు, ఘనమయిన చరిత్ర లేదు
పారే జెలపాతాలు లేవు, పరవసించే పాడి పంటలు లేవు
పుట్టింది ఇక్కడ కాదు, పెరిగింది ఈ ఊరులొ కాదు
అయిన మా ఊరు అంటె ఏదొ తెలియని ఇష్టము, అంతులేని అభిమానము


వెల్లువలొ ఊరంతా మునిగి పొగా ఆ వెల్లువులొ కొట్టుకొఛ్హి
నడి వీదిలొ నిలిచిన లింగం పూజకు వెలిసిన నడివీది శివాలయము
అంతరించిపొతున్న హైందవ కాలక్షెప కార్యక్రమాలు బుర్ర కథలు,హరి కథలు
అప్పుడప్పుడు వినిపించే సౌమ్యనాద ఆలయ ప్రాంగనము
నేను నాది అనే నా ఆలోచనలను ఆత్మ పరమాత్మ వైపు కాసెపయిన మరల్చుతాయి


ఊరి చుట్టూ ఎత్తయిన కొండలు
అక్కడక్కడ ఏపుగా పెరిగిన చెట్లు
వేకువ జామున చల్లని గాలులు
సడి చప్పుడు లేని సాయంత్రాలు
రన ఘన ధ్వనల నగరంలొ విసిగి వెసాగిన నాకు ఊరటనిస్తాయి


ప్రతి ఏడు ఈ ఏడన్నా గంగమ్మ తల్లి కరుణిస్తుందని జాతరలు
సిరి సంపదలు సొంతమవుతాయని సంప్రదాయ సంక్రాంతి సంబరాలు
ఆధునిక ఆచారాలను అలవాటు చేసుకునె ప్రయత్నంగా గణేష్ ఉత్సవాలు
పండగనగానె నన్ను పట్టణం నుంచి పల్లెకు పరుగులు తీయనిస్తాయి


ఎంత పెద్ద చదువు చదివినా, ఎంత డబ్బు సంపాదించినా
ఎన్ని ఊర్లు మారిన, ఎన్ని దేశాలు తిరిగినా
అంతిమ సమయంలొ ఆరు అడుగల స్థలమె మిగిలేది
ఆ ఆరడుగుల స్థలము మా ఊరిలొ పొందాలని, ఆ ఆకరి స్వాస మాఊరిలొ మా మనుషుల మద్య విడవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది - నాక్కూడ ...


L Ragas ...

Saturday, January 22, 2011

జీవితం

జీవితం

ఆరో తరగతి వరకు ఆటపాటలతొ ఆనందంగా సాగె కాలము
అనుకోని అనారోగ్యాన్ని అర కొర వైద్యము ఆపలేక పోయె, తండ్రి పోయె
ఆ దిగులుతొ తల్లి కూడ తండ్రిదరికే తరలి పోయె, బ్రతుకు భారమాయె

ఉన్న ఆస్తి అన్న తాగుడుకి తరిగిపోయె
ఒదిన పెత్తనానికి బ్రతుకు వీదిపాలాయె
తిండె కరువాయె, ఊరు చివర గువియె గూడాయె

తప్పుదారి పడదామంటె తల్లికిచ్చిన మాట గురుతాయె
ఎస్.ఎల్.సి చదవాల, అమ్మ కోరిక తీర్చాల కాని పైసలు లెవాయె
అయిన వాళ్ళింటికె వారాల పని కుదిరె, ఒడ్లు దంచి కట్టెలు కొట్టగా కడుపు నిండె

వయసు పెరిగె, వయసుతొ పాటు ఆకలి పెరిగె
గొడ్డు చాకిరి చేసినా సద్ది కూడె తిండాయె
ఎలా బతకాలి ఎన్నాల్లిలా బతకాలి అని మనసంతా దిగులాయె

అడవి తల్లి కరుణించె ఫారెష్టు గార్డు ఇంట పనికుదిరె
పట్టణంలొ పోలీసు సెలెక్షను కబురందె, పట్టుదల మొదలాయె
పచ్చిపాలు తాగి అడవి ఫలాలు తిని, బాద కోపం కసి కలగలిపిన
కసరత్తులతొ కఠిన సాధన సాగె, కానీష్టెబులు ఉద్యొగం ఒచ్చె

మూడు పూటల భోజనం దొరికె
పెళ్ళి జెరిగె, బిడ్డకూడ పుట్టె
కాలం మళ్ళి చిన్న చూపు చూసె
పుట్టిన బిడ్డ రెండొ రోజె కనుమూసె
ఆ బిడ్డ తోటె తల్లీ పయనమాయె, మళ్ళి ఒంటరి బతుకాయె

శోక సముద్రంలొ బ్రతుకు నావ సాగె
శూన్య ప్రయాణంలొ సంవత్సరాలు గడిచిపోయె
గత జ్ఞాపకాలు మరిచాక పెద్దల ప్రొద్బలంతొ మరో పెళ్ళి జెరిగె
అయిదుగురు సంతానంతొ వంశవ్రుక్షము చిగురించె

పేదరికం నుంచి బ్రతుకు బయట పడె
మధ్యతరగతి మహాభారతం మొదలాయె
సొంత ఇంటి కల, ఆ కల సాధనలొ అత్తమామల గోల
అన్నీ దాటెక గ్రుహొపవేశ ఆనందము
ఇంతలోనే చిన్నోడికి ప్రాణాపాయ జబ్బు
ఆ వైద్యుడు ఈ వైద్యుడు అంటూ పరుగులు
అప్పులతొ ఆపరేషన్ అయ్యాకే చావునుంచి చిన్నోడు బయటపడె

పిల్లల చదువులు, ఆపై ముగ్గురు ఆడ పిల్లల పెళ్ళిల్లు
వియ్యంకుల పట్టింపులు, అల్లుల్ల బుజ్జగింపులు
ఇలా ఒడిదిడుకుల ప్రయాణంలో మరో మలుపుగా వొచ్చె మధుమెహ వ్యాది

ఉన్న ఊరిలొ సొంత ఇల్లు
సొంత ఊరిలొ కొంత భూమి తప్ప
ఏమీ పెద్దగా పోగు చేయలేకపోయె
పూర్తిగా స్తిరపడని పెద్దొడు
పై చదువులకెళ్ళిన చిన్నోడు
ఇంతలోనే వొచ్చె పదవీవిరమన సమయము,మళ్ళీ దిగులు మొదలాయె

ఒ వైపు తరుగుతున్న ఆరోగ్యము
మరో వైపు పెరుగుతున్న ఆవేదన
ఎలా గట్టెక్కుతారో బిడ్డలు అని భయమాయె
ఎలా గడ్డనేయగలనో సంసారాన్ని అన్న
ఆలోచనల్లో ఉండగా వొచ్చె తీయటి కబురు
చిన్నోడు సాఫ్ట్ వేరు ఇంజనీరాయె, పెద్దోడు సర్కారు నౌకరాయె

లక్ష్మీదేవి కరుణించె, చిన్నోడు విదేశాలు వెళ్ళె
కొంచెం కొంచెం స్థితిగతులు మారె, సొంతఊరిలొ ఇల్లు పొలం అన్నీ వొచ్చె
కుమారులకు పెళ్ళిల్లు ఆయె, వంశోద్దారుకులు పుట్టె మనసు కుదిటపడె

చాలా సంక్రాంతుల తర్వాత చిన్నోడు ఈ సంక్రాంతికి ఇంటికొచ్చె
కనుమ నాడు పొలం గట్టున ఈ నా ముప్పాతిక సంవత్సరాల
జీవితగాదను చిన్నోడు ముందు నా మనసు నెమరేసె
ఆ రోజు రేయంతా ఏదో రాస్తూనె ఉన్న చిన్నోడిని చూసి కంగారు మొదలాయె
మరుసటి రోజు రైలు కదలబోయెముందు చెమ్మగిల్లిన కళ్ళతొ అందిచ్చె చిన్నోడు ఈ టపాను ...


L Ragas ....

Wednesday, August 19, 2009

నీ దాన్నై వొస్తాను ...


నన్ను కలవాలన్నావు
నాతో నడవాలన్నావు
నేను కలిసే క్షణం కోసం
వేయి కనులతో వేచి ఉన్నావు


నా నవ్వు నచ్చిందన్నావు
నీ మనసంతా నేనెనన్నావు
నన్నే ఆరాదించె
నీ గురించి ఆలోచించమన్నావు


కలిసి చదువుకున్న క్లాస్ మేట్ వి కాదు
పరిచయం ఉన్న పక్కింటి అబ్బాయివి కాదు
ఇంటర్నెట్ లొ చూసావు చాటింగ్ లొ కలిసావు
సాఫ్ట్ వేర్ స్నేహానివి టెలిఫోన్ నేస్తానివి


ఆకర్షించే అందగాడివి కాదు
సిరులున్న శ్రీమంతుడువి కాదు
విశాలమయిన వెక్తిత్వమూ లేదు
అయినా నీలొ ఏదొ తెలియని ప్రత్యెకత


ఇంతమంది స్నేహితులు వున్నా నీతొ చెప్పుకున్న ఊసులు ప్రత్యేకం
ఎంతో చక్కని కుటుంబంలొ వున్నా నీతొ గడిపిన క్షణాలు ప్రత్యేకం
పుట్టిన రోజున ఖరీదయిన బహుమతులు ఎన్నో వొచ్చినా
చిన్ని కవితతొ నువ్విచ్చిన దీవెనలు ఎంతో ప్రత్యేకం


తరగని నీ సహనము
చేరగని నీ చిరునవ్వు
నవ్వించే నీ మాటలు
కవ్వించే నీ కవితలు


నువ్వు నమ్ముకున్న సిద్దాంతాలు, నస పెట్టె నీ వేదాంతాలు :-)
నీకంటూ కట్టుకున్న నీ ఊహలోకం, నన్నల్లుకున్న నీ ప్రణయ ప్రపంచం
అన్నీ నిన్ను నా మదినిండా చిత్రుస్తున్నవి రా
అన్నీ నన్ను నీ దరికి చేరుస్తున్నవి రా


మా వాళ్ళను ఒప్పించలేమని తెలుసు
మీ వాళ్ళను మెప్పించలేమని తెలుసు
మనం కలిసి వుండేల ఈ వెవస్తను
మార్చలేమనీ తెలుసు, అయినా నీతొ వొస్తాను


వెబ్ క్యాం చూపులు తప్ప ఎప్పుడు ఎదురపడి చూడని నా కోసం
నాలుగేల్లుగా గుండేల మీద మల్లేల దారి పరుచుకున్న నీ కోసం వొస్తాను
తల్లిదండ్రుల ఆప్యాయత తప్ప ప్రేమంటే తెలియని నాలో
నీ వలపుల తలపులతొ మది నిండా ప్రేమ నింప్పిన నీకై నీ దాన్నై వొస్తానుస్తాను ...



L Ragas ...


Saturday, August 1, 2009

దీవించండి



ఉత్తరాన ఉదయించిన గంగమ్మ తల్లి
దక్షిణాన వెలసిన వెంకన్న స్వామి
తూర్పున కొలువయిన కనక దుర్గమ్మ తల్లి
పడమర ప్రకాశించిన షిరిడి సాయి నాదా
నాలుగు దిక్కులు, పంచ భూతాలు సాక్షిగా
నిండుగ నూరేళ్ళు జీవించమని నా చెలిని దీవించండి ...

సూర్య చంద్రులారా
ముల్లోకాల దేవతలారా
చతుర్వేదాల సాక్షిగా
నా పంచ ప్రాణాల ప్రేయసిని దీవించండి ...

సప్త ఋషులారా
అష్ట దిక్పాలకులారా
నవగ్రహాల సాక్షిగా
పది కాలాలు చల్లగా ఉండమని నా దేవతను దీవించండి ...

పాఠకులారా, పండితులారా
స్నేహితులారా, శ్రెయొభిలాషులారా
మంచి గందమంటి మీ మనసే సాక్షిగా
నా కోసం పుట్టిన నా ప్రియసఖిని పుట్టిన రోజు శుభాకాంక్షలతో దీవించండి ...

L Ragas ...

Sunday, July 5, 2009

తెలియదు !!



తెలియదు !!


సర్కారీ బడిలో సాంబార్ అన్నం కోసం పళ్ళెం పట్టుకొని పంక్తిలో నిలుచిన్న రోజుల నుంచి
హాలివుడ్ స్టుడియోలో హాలిడే స్పెషల్ లంచ్ తినే రోజులు వొచ్చిన తీరు తెలుసు


టెంట్ హాల్లో నేల టిక్కెట్, చేక్కిలం ముక్కతో మట్టిలో కూర్చోని సినిమా చూసిన రోజుల నుంచి
PVR సినిమాలో ప్రీమియం టిక్కెట్, పెప్సి పాప్ కార్నులు తీసుకునే రోజులు వొచ్చిన తీరు తెలుసు


పైసలు లేక పదో తరగతి వరకు ప్యాంటు కొనలేని రోజుల నుంచి
బ్రాండెడ్ బట్టలు కొంటూ దర్జీ దగ్గరికి పోనవసరం లేని రోజులు వొచ్చిన తీరు తెలుసు


చెప్పిన పాఠాలె మల్లి మల్లి చెప్పే టుషన్స్ నడిపి నెలకు ఐదు వందలు సంపాదించిన రోజుల నుంచి
కార్పొరేట్ లోకంలో కంపెనీ తర్వాత కంపెనీ మారి రోజుకు ఐదు వేలు సంపాదించే రోజులు వొచ్చిన తీరు తెలుసు



కాని చిన్ని చిన్నికోరికల చిన్న తనం నుంచి
మనీ తప్ప మరేది మదిలో లేని మద్య వయసు వొచ్చిన తీరు తెలియదు


ముందు కష్టపడు తర్వాత సుఖాలు అవే వొస్తాయి అనే నాన్న సూక్తులు పాటించి పాటించి
అనుభవించే ప్రాయం పోయి ఆవేదన మాత్రం మిగిలిన ప్రాయం వొచ్చిన తీరు తెలియదు


కోరికలు ఇష్టాలు అందరికి ఇచ్చిన ఆ దేవుడు
అవి తీర్చుకునే అవకాశం అవసరమయిన డబ్బులు కొందరికే ఎందుకు ఇచ్చాడో తెలియదు


L Ragas !!